కొన్నిసార్లు ముచ్చట పడి మనం ఫోటో తీసుకునేటప్పుడు, మన ప్రమేయం లేకుండానే మన వెనక మనకు
తెలియని ఎవరైనా వ్యక్తులు అటు వెళుతూ ఉండటం జరుగుతుంది. ఫోటో అంతా బాగుంటుంది కానీ కేవలం ఆ వ్యక్తుల వలన మనం ఫోటో ఇతరులతో షేర్ చేసుకోవాలంటే ఆలోచిస్తుంటాం.
తెలియని ఎవరైనా వ్యక్తులు అటు వెళుతూ ఉండటం జరుగుతుంది. ఫోటో అంతా బాగుంటుంది కానీ కేవలం ఆ వ్యక్తుల వలన మనం ఫోటో ఇతరులతో షేర్ చేసుకోవాలంటే ఆలోచిస్తుంటాం.
మరికొన్ని సందర్భాల్లో మంచి సీనరీలో ఎవరో తాగి పడేసిన వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లు వంటివి చూడటానికి ఎబ్బెట్టుగా కనిపిస్తుంటాయి. అలాంటి చోట్ల మన ఫోటోలు దిగినా కూడా కేవలం అలాంటి ఆబ్జెక్ట్స్ వలన ఆయా ఫోటోలు అసహ్యంగా కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో చాలామంది ఫోటో షాప్ ఓపెన్ చేసి అందులో ఉండే రకరకాల టూల్స్ ఉపయోగించి కష్టపడి ఫొటోలను ఎడిట్ చేస్తూ ఉంటారు.
అంత కష్టపడాల్సిన పని లేకుండానే, Bye Bye Camera అనే అప్లికేషన్ ఉపయోగించటం ద్వారా ఒక ఫోటో లో మనకు అవసరం లేని ఏ అంశాన్నైనా చాలా సులభంగా తొలగించుకోవచ్చు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా, neural networksని ఆసరాగా చేసుకొని ఒక ఫోటో లో ఉండే అవసరమైన వ్యక్తులు, ఇతర ఆబ్జెక్టులను తొలగిస్తుంది. అలా తొలగించబడిన ఏరియాలో చుట్టుపక్కల ఉన్న పిక్సల్స్ నింపబడే విధంగా ఇది ఏర్పాటు చేస్తుంది.
ఇదే రకమైన అనేక అప్లికేషన్స్ ఇప్పటికే అందుబాటులో ఉన్నప్పటికీ వాటన్నిటికంటే ఇది శక్తివంతంగా పనిచేస్తుంది. ప్రస్తుతానికి iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే iPhone వినియోగదారులకు App Storeలో ఈ యాప్ లభిస్తోంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం వాడే వినియోగదారులకు అతి త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఫోటోలను సులభం ఎడిట్ చేయడానికి తప్పకుండా ప్రయత్నించవలసిన అప్లికేషన్ ఇది.