Thu. Jan 21st, 2021

ఏకంగా Facebook CEO పోస్టులే డిలీట్ అయ్యాయట!

ఈ మధ్య చాలామంది Facebook  వినియోగదారులు తమ పోస్టులు అకారణంగా డిలీట్ అవుతున్నాయని కంప్లైంట్ చేస్తున్నారు.
ఫేస్బుక్ పోస్టులు డిలీట్ అవటానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మనకు మనం పొరబాటున తొలగించుకునే అవకాశంతో పాటు,  ఫేస్బుక్ community guidelinesని ప్రాతిపదికగా తీసుకుని, ఫేస్బుక్ సంస్థ ఉపయోగిస్తున్న ఆటోమేటెడ్ టూల్స్ కొన్ని అభ్యంతరకరమైన పోస్టులను గుర్తించినట్లయితే ఆ నిర్దిష్టమైన యూజర్‌కి వార్నింగ్ ఇవ్వడం ద్వారా ఫేస్బుక్ వాటిని తొలగిస్తుంది.

అయితే ఈ కారణాలన్నీ పక్కన పెడితే, Facebook CEO Mark Zuckerbergకి  సంబంధిత పేజ్ నుండి 2007 మరియు 2008 సంవత్సరానికి సంబంధించిన అనేక పోస్టులు డిలీట్ అయినట్లుగా ఫేస్బుక్ సంస్థ స్వయంగా నిర్ధారించింది.  దీనికి సంబంధించిన కారణాలను అన్వేషిస్తున్నట్లుగా.. వాటిని తిరిగి వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఫేస్బుక్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే అలా వెనక్కి తీసుకోవటం చాలావరకు సాధ్యపడక పోవచ్చు అని కూడా ఆ సంస్థ అభిప్రాయపడింది.

వాస్తవానికి ఇటీవలి కాలంలో డిలీట్ చేయబడిన పోస్టులు గనుక అయినట్లయితే,  వాటిని చాలా సులభంగా వెనక్కి తీసుకు రావచ్చు. అయితే వివిధ కారణాల వల్ల దాదాపు పదేళ్ల క్రితం డిలీట్ అయిన పోస్ట్ లు కావటం వలన,  అప్పట్లో బ్యాకప్ సర్వర్లు కూడా పెద్దగా వినియోగంలో లేకపోవడం వల్ల ఫేస్బుక్ సీఈఓ కు సంబంధించిన డిలీట్ అయిన పోస్ట్ లు వెనక్కి వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
ఏదేమైనప్పటికీ.. ఫేస్బుక్ సంస్థ అనేక రకాల సాంకేతిక లోపాలను అధిగమించవలసిన అవసరం ఉంది.  ఇటీవల దాదాపు 12 గంటల పాటు ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, వాట్సాప్ సక్రమంగా పని చేయని ఈ విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఇలాంటి సాంకేతిక లోపాలను సరి చేయకపోతే మాత్రం వినియోగదారులు ఇబ్బంది పడతారు. కంటెంట్ మేనేజ్మెంట్ విషయంలో ఫేస్బుక్ దగ్గర ప్రస్తుతం బలమైన వ్యవస్థ నెలకొల్పబడి వుంది.