Mon. Jan 18th, 2021
by
google maps stay safer feature
Google Maps  ప్రత్యేకంగా భారతీయ వినియోగదారుల కోసం Stay Safer అనే  అద్భుతమైన సదుపాయం తీసుకువచ్చింది.
క్యాబ్, ఆటో, టాక్సీలలో  ప్రయాణించే సమయంలో కొన్ని సందర్భాలలో డ్రైవర్లు  సరైన రూట్లో వెళ్లకుండా దారి మళ్లించే ప్రమాదం ఉంటుంది. అలాంటి ప్రయత్నాలు అడ్డుకోవడం కోసం ఈ కొత్త సదుపాయం పనికొస్తుంది.  వెళ్లవలసిన రూట్ కంటే 0.5 కిలోమీటర్లను దాటి ఇతర రూట్లో వెళుతుంటే వెంటనే ఆ విషయాన్ని గూగుల్ మ్యాప్స్ అలర్ట్ రూపంలో వినియోగదారులకు చూపిస్తుంది. Android  ఆపరేటింగ్ సిస్టంలో Google Maps వాడే వాళ్లకి ప్రస్తుతం ఇది అందుబాటులోకి వచ్చింది.

క్యాబ్‌లో ప్రయాణం ప్రారంభించడానికి ముందు,  మీ ఫోన్ లో Google Maps ఓపెన్ చేసి, డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే Stay Safer అనే ఫీచర్  ఎనేబుల్ చేయవచ్చు. అందులో Get off-route alerts అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ డ్రైవర్ గనుక వెళ్లవలసిన రూట్ కన్నా అర కిలోమీటర్  దూరంగా వెళ్ళినట్లయితే, వెంటనే ఫోన్ లో నోటిఫికేషన్ చూపించ బడుతూ అలర్ట్ చేయబడుతుంది. దానిని క్లిక్ చేసిన వెంటనే, ఒరిజినల్ లొకేషన్ తో పాటు ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నది అన్నది కూడా చూపించబడుతుంది.

అంతేకాదు, అప్పటికప్పుడు తమ రియల్ టైమ్ లొకేషన్ తమ కుటుంబ సభ్యులు,  స్నేహితులకు షేర్ చేసుకోవటానికి ఇది అవకాశం కల్పిస్తుంది. ఒంటరిగా ప్రయాణించే మహిళా ప్రయాణికులకు చాలా సందర్భాలలో రక్షణగా ఇది నిలుస్తుంది.  ముఖ్యంగా తెలియని ప్రదేశాల్లో ప్రయాణించేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. iOS ఆపరేటింగ్ సిస్టం వాడే యూజర్లకు ఇది త్వరలో అందుబాటులోకి వస్తుంది.