. అయితే వాస్తవానికి అది ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక పేమెంట్ గేట్వే. మిగతా వాటితో పోలిస్తే చాలా సురక్షితమైనది కూడా!
వాస్తవానికి ఈ సర్వీస్ ద్వారా ఇప్పటి వరకు అనేక రకాల బిల్స్ చెల్లించే అవకాశం లభిస్తోంది. ఉదాహరణకు మీరు Airtel, Tata Sky వంటి డిటిహెచ్ సేవలకు రీఛార్జ్ చేసుకోవడం మొదలుకొని, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, టెలికం, వాటర్ వంటి అన్ని రకాల బిల్లులు ఒకే చోట చెల్లించే అవకాశం ఉంటుంది. దాదాపు అన్ని భారతీయ రాష్ట్రాల సంబంధించిన ప్రముఖ సర్వీసులు ఇక్కడ లభిస్తాయి.
అయితే ఇప్పటి వరకు కేవలం లేటెస్ట్ బిల్లు చెల్లించే అవకాశం మాత్రమే ఉన్న ఈ భారత్ బిల్ పేమెంట్ సిస్టం ద్వారా, ఇక మెడ పూర్తిస్థాయిలో రికరింగ్ బిల్లులు కూడా ఆటోమేటిక్ గా చెల్లించే వెసులుబాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పించింది. అంటే ఉదాహరణకు మీరు ప్రతి నెల ఆటోమేటిగ్గా వాటర్ బిల్ గానీ, ఎలక్ట్రిసిటీ బిల్ గానీ ప్రత్యేకంగా ఆలోచించాల్సిన పని లేకుండా నేరుగా భారత్ బిల్ పేమెంట్ సిస్టం ద్వారా చెల్లించే అవకాశం కలుగుతుంది.