ఈ మధ్య కాలంలో దాదాపు అందరు Smart TVలనే కొనుగోలు
చేస్తున్నారు. నేరుగా ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యి, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, NetFlix వంటి వివిధ రకాల స్ట్రీమింగ్ సర్వీసుల ద్వారా వీడియోలను చూడడం కోసం వీటిని ఎంపిక చేసుకుంటున్నారు.

అంతవరకు బానే ఉంది కానీ, ముచ్చటపడి మనం కొనుకున్న Smart TVలు మనకు తెలీకుండా మన డేటాను లీక్ చేస్తున్నట్లు తాజాగా వెల్లడైంది. Samsung, LG వంటి అన్ని రకాల పాపులర్ బ్రాండ్స్‌కి సంబంధించిన టీవీ లతోపాటు Amazon Fire TV, Roku వంటి స్ట్రీమింగ్ డివైజెస్ కూడా వినియోగదారులకు సంబంధించిన సమాచారం ఇతర కంపెనీలకు అందజేస్తున్నట్లు నార్త్ఈస్ట్రర్న్ యూనివర్సిటీ పరిశోధకులు తాజాగా కనుగొన్నారు.
ప్రధానంగా స్మార్ట్ టీవీలు ప్రస్తుతం వినియోగదారుడు వాడుతున్న స్మార్ట్ టీవీ మోడల్, వారి లొకేషన్, మరియు వారు ఇంటర్నెట్ కి ఏ ఐపీ అడ్రస్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నారు వంటి సమాచారాన్ని చేరవేస్తున్నట్లుగా వెల్లడైంది. వినియోగదారుడికి ఏమాత్రం సమాచారం అందించకుండా, అతని అనుమతి కూడా తీసుకోకుండా Netflix, Spotify, Microsoft, Akamai, Google వంటి వివిధ టెక్నాలజీ దిగ్గజ కంపెనీలకి రహస్యంగా సమాచారం చేరవేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ సమాచారాన్ని ఆసరాగా చేసుకొని ఆయా సంస్థలు తమ క్లౌడ్ సర్వీసెస్ మెరుగుపరచుకోవడం కోసం, ఇతర మార్కెటింగ్ అవసరాల కోసం దాన్ని వినియోగించుకున్నాయి. స్మార్ట్ టీవీ లోని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లో అంతర్భాగంగా భావిస్తూ ఉంటారు. కంప్యూటర్లు మరియు మొబైల్ డివైసెస్ ప్రైవసీ పరంగా ఇటీవలి కాలంలో బాగా అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతూ వివిధ రకాల సర్వీసులు అందిస్తున్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డివైసెస్ సెక్యూరిటీ మరియు ప్రైవసీ విషయంలో కూడా వినియోగదారులు తగినంత అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఆయా డివైజ్‌లను తయారు చేసే టెక్నాలజీ కంపెనీలు కూడా వినియోగదారుల ప్రైవసీకి తగినంత భద్రత కల్పించక తప్పదు.