మనకు కావలసిన అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోవడం కోసం Google Play Store మీద ఆధారపడుతూ ఉంటాం.
అయితే గూగుల్ ప్లే స్టోర్ లో పెద్ద మొత్తంలో నకిలీ అప్లికేషన్లు ఉన్నట్లు ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ తాజాగా జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.
అయితే గూగుల్ ప్లే స్టోర్ లో పెద్ద మొత్తంలో నకిలీ అప్లికేషన్లు ఉన్నట్లు ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ తాజాగా జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.
చాలామందికి సుపరిచితమైన పాపులర్ అప్లికేషన్ల మాదిరిగా దాదాపు 50 వేల అప్లికేషన్లు గూగుల్ ప్లే స్టోర్ లో నకిలీ గా చెలామణీ అవుతున్నాయట. అంతేకాదు వాటిలో 2,000 యాప్స్ గూగుల్ కళ్లుగప్పి ప్రమాదకరమైన కోడ్ కలిగి ఉన్నాయి. Neural networks మరియు మాల్వేర్ స్కానర్లను కలగలిపి గూగుల్ ప్లే స్టోర్ లో ఉండే అన్ని అప్లికేషన్లని స్కాన్ చేయటం ద్వారా ఈ విషయం వెల్లడైంది.
బాగా పాపులర్ గా డౌన్లోడ్ చేసు కుంటున్న పదివేల అప్లికేషన్లు ఒకే రకమైన ఐకాన్లు, కనీసం ఒక్క లైన్ కూడా మారకుండా ఒకే తరహా డిస్క్రిప్షన్ కలిగి ఉండడం వెలుగులోకి వచ్చింది. గేమ్స్ విషయంలో Temple Run, Hill Climb Racing, Free Flow వంటి పాపులర్ గేమ్స్‌కి సంబంధించిన అనేక నకిలీలు గూగుల్ ప్లే స్టోర్ లో దాగి ఉన్నాయి. ఏది నిజమైన గేమ్, ఏది నకిలీది అన్నది గుర్తించలేక చాలా మంది చిన్న పిల్లలు తమ ఫోన్లలో నకిలీ గేమ్స్ ఇన్ స్టాల్ చేస్తున్నారు.
అధిక శాతం ఉన్నట్లు అప్లికేషన్లు, గేమ్స్ తమకు అవసరమైన దానికంటే ఎక్కువ పర్మిషన్లు సేకరిస్తున్నాయి. ఉదాహరణకు బ్రౌజింగ్ హిస్టరీ లాంటి ఒక యాప్‌కి పెద్దగా అవసరం లేని సమాచారం కూడా యూజర్ల వ్యక్తిగత డేటా దొంగిలించడం కోసం సంబంధిత అప్లికేషన్లు యాక్సెస్ చేస్తున్నాయి. ఇలాంటి నకిలీ అప్లికేషన్ లను గుర్తించి తొలగించడం కోసం, గూగుల్ సంస్థ ఎప్పటికప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అనేక కొత్త మార్గాల్లో ఇవి గూగుల్ కళ్లుగప్పి ప్లే స్టోర్ లో విచ్చలవిడిగా చలామణి అవుతున్నాయి.
ఒక యూజర్‌గా మనం చేయగలిగింది, ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు దానికి సంబంధించిన రివ్యూలు చదవడం, దాన్ని రేటింగ్, ఇతర వివరాలు నిశితంగా పరిశీలించడం, ఏది నకిలీ అప్లికేషన్, ఏది అసలు అప్లికేషన్ అన్నది గుర్తించగలిగే విధంగా పరిజ్ఞానం పెంచుకోవడం చేయాలి.