Wed. Jan 20th, 2021

Facebook Messenger  ఉపయోగించే వినియోగదారులకు శుభవార్త.  సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న Dark Mode  సదుపాయం మెసెంజర్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు రా బడింది.

అధిక సమయం పాటు చాటింగ్ చేసేటప్పుడు కళ్ళ మీద తీవ్రమైన ఒత్తిడి పడకుండా ఉండటం కోసం ఈ డార్క్ మోడ్  ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు వైట్ బ్యాక్‌గ్రౌండ్ మీద బ్లాక్ లెటర్స్ కనిపిస్తుండడం వల్ల ఆ వెలుతురికి  పరోక్షంగా కళ్ల మీద బాగా ఒత్తిడి పడుతుంది. కేవలం కళ్ళ మీద ఒత్తిడి గురించి మాత్రమే కాకుండా.. డార్క్ మోడ్  పరోక్షంగా మన ఫోన్ యొక్క బ్యాటరీని ఆదా చేస్తుంది. ముఖ్యంగా Super AMOLED డిస్‌ప్లేలు కలిగిన ఫోన్లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా లభిస్తున్న నేపథ్యంలో..  అలాంటి ఫోన్లలో Facebook Messenger వంటి అప్లికేషన్లలో డార్క్ మోడ్ ఉపయోగించటం ద్వారా పెద్ద మొత్తంలో బేటరీ యాడ్ అవుతుంది.

మీ ఫేస్బుక్ అకౌంట్ లో ఇప్పటికీ దీన్ని మీరు వాడకపోతూ ఉన్నట్లయితే..  ఒకసారి మెసెంజర్ అప్లికేషన్ ఓపెన్ చేసి, అందులో Settings అనే విభాగంలోకి వెళ్లి అన్నిటికంటే పై భాగంలో కనిపించే Dark Mode అనే ఆప్షన్  ఎనేబుల్ చెయ్యండి. ఇకమీదట మీకు ఫేస్బుక్ మెసెంజర్ ఛాట్ మొత్తం డార్క్ మోడ్‌లోకి మారిపోతుంది.
ఒకవేళ దీన్ని వద్దనుకుంటే అదే ప్రదేశంలో డిజేబుల్ చేస్తే సరిపోతుంది. అయితే ఎక్కువ సమయం ఫేస్బుక్ మెసెంజర్ మీద గడిపేవారు దీన్ని ఎనేబుల్ చేసుకుని పెట్టుకోవడం కచ్చితంగా ప్రయోజనకరం. కొద్దికాలం క్రితం వరకు ప్రపంచ వ్యాప్తంగా అతి కొద్ది మంది వినియోగదారులకు మాత్రమే ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకు రాబడిన ఈ సదుపాయం ఇప్పుడు అందరు వినియోగదారులకు లభిస్తోంది.