Sun. Jan 24th, 2021
UPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) ఆధారంగా పనిచేసే Google Pay, PhonePe లాంటి

అప్లికేషన్లలో అనేక కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వీటి నిర్వహణ వెనక ఉన్న నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనేక సమూలమైన మార్పులను తీసుకు రాబోతోంది.

రెండు లక్షల వరకు

ఇప్పటివరకు గరిష్టంగా కేవలం ఒక్కో లావాదేవీకి లక్ష రూపాయలు మాత్రమే UPI ద్వారా బదిలీ చేసుకోడానికి అవకాశం కల్పిస్తోంది.  అయితే డబుల్ KYC కలిగి ఉన్న విభాగాల్లో ఇకపై 2 లక్షల రూపాయల వరకు ఒక్కో లావాదేవీకి ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా అవకాశం రాబోతోంది. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డు చెల్లింపులు వంటి రంగాలకు ఇది ఉపయోగపడుతుంది.

మరింతమందికి

Google Pay, PhonePe, BHIM వంటి  అన్ని రకాల UPI అప్లికేషన్లను ఉపయోగించటానికి,  అందులో మొట్టమొదట బ్యాంక్ ఎకౌంట్ జత చేసుకునే సమయంలో డెబిట్ కార్డ్ లోని చివరి నాలుగు నెంబర్ల ఆధారంగా బ్యాంకు ఖాతాలు జత చేయబడతాయి. అయితే అందరికీ డెబిట్ కార్డులు ఉండవు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఆధార్ OTP  ఆధారంగా UPIలో రిజిస్టర్ చేసుకునే విధానాన్ని కూడా ప్రవేశపెడుతున్నారు. అలాగే వ్యాపారస్తులు, ఖాతాదారులు GSTIN, PAN నెంబర్లను కూడా లావాదేవీల తోపాటు జత చేసే అవకాశాన్ని కల్పించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ రెవిన్యూ కోరడం జరిగింది.