Relinace Jio వాడుతున్న వారికి శుభవార్త. ఇండియాలో మిగతా టెలికాం కంపెనీల కంటే ముందే Reliance Jio సంస్థ తన వినియోగదారుల కోసం 5G సదుపాయం ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది.
వాస్తవానికి Jio 2016లో మార్కెట్లోకి రావడానికి ముందు, దాదాపు అన్ని టెలికాం కంపెనీలు 3G సేవలు మాత్రమే అందించేవి. 4G కేవలం హైదరాబాద్ వంటి కొన్ని నగరాల్లో మాత్రమే లభించేది. అలాంటిది కాస్త రావడం రావడం Reliance Jio దేశవ్యాప్తంగా 4G సదుపాయంతో రావడంతో ఆత్మరక్షణలో పడిన Airtel, Idea, Vodafone వంటి ఇతర సంస్థల అన్నీ అప్పట్లో యుద్ధప్రాతిపదికన దేశవ్యాప్తంగా 4G సేవలు మొదలుపెట్టాయి.
ఇప్పటికికూడా ఇతర టెలికం కంపెనీలు పూర్తిస్థాయిలో 4G సేవలు అందించడం లేదనే చెప్పుకోవాలి. తమ 4G నెట్వర్క్ శక్తిసామర్ధ్యాలను మరింత మెరుగు పరచడం కోసం Airtel, Vodafone Idea సంస్థలు ప్రస్తుతం పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నాయి. ఈ సంస్థలు ఇప్పటికీ 4G మీదనే దృష్టి పెట్టడం గమనించిన Reliance Jio సంస్థ వాడి కంటే ముందే 5G సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి కంకణం కట్టుకుంది. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం 2020 జనవరిలో ఇండియాలో 5G spectrum వేలం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, 2020 జూలై నుండి డిసెంబర్ మధ్య కాలంలో Reliance Jio దేశవ్యాప్తంగా 5G సేవలు ప్రారంభించే ప్రయత్నాల్లో ఉంది.
ఇదిలా ఉంటే Airtel, Vodafone Idea వంటి సంస్థలు వివిధ కారణాలను దృష్టిలో పెట్టుకుని 2021 వరకూ 5G సేవలకు దూరంగా ఉండాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే గనక జరిగితే, 5G ఫోన్లు కలిగి ఉన్న భారతీయ వినియోగదారులకు Reliance Jio తప్పించి వేరొక ప్రత్యామ్నాయం లభించే అవకాశం లేదు. వాస్తవానికి ఈ సంవత్సరం జూన్ నుండి మొదలుకొని అనేక ఫోన్ తయారీ కంపెనీలు 5G ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి. మొదట్లో ఇవి కొద్దిగా ఖరీదుగా ఉన్నప్పటికీ కాలక్రమేణా సామాన్య వినియోగదారులకు కూడా అందుబాటులోకి రావచ్చు.