Tue. Jan 26th, 2021
Xiaomi  సంస్థ ఒక దాని తర్వాత మరొకటి కొత్త స్మార్ట్ఫోన్లు ఎప్పటికప్పుడు భారతీయ మార్కెట్లో విడుదల చేస్తోంది.

అందులో భాగంగా జూలై 15వ  తేదీ ప్రాంతంలో Redmi 7A ఫోన్  ఇండియాలో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.  ఈ ఫోన్ తో పాటు Redmi K20, K20 Pro మోడళ్లు కూడా రాబోతున్నాయి. నెలరోజుల క్రితం Redmi 7A  మోడల్ చైనా మార్కెట్ లో వచ్చింది. 5.45 అంగుళాల IPS LCD డిస్ప్లే కలిగిన ఈ ఫోన్ 720×1440 పిక్సెల్స్ రెజల్యూషన్ కలిగి ఉంటుంది.  2GB RAM, 16 GB ఇంటర్నల్ స్టోరేజ్, 2GB RAM, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన రెండు మోడల్స్ గా బడ్జెట్ ఫోన్ వినియోగదారుల కోసం ఈ ఫోన్ రూపొందించబడింది.

మెమరీ కార్డు ద్వారా  అదనంగా స్టోరేజ్ పొందొచ్చు. Android 9 Pie  ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే MIUI 10 ఇందులో ఉపయోగించబడుతుంది. 4000 mAh  కెపాసిటీ కలిగిన బ్యాటరీ, 10W చార్జర్ ఈ ఫోన్ తో అందించబడుతుంది. ఫోన్ వెనుక భాగంలో 13 మెగా పిక్సల్ కెమెరా LED  ఫ్లాష్ లభిస్తాయి. అలాగే Redmi 7A ఫోన్ ముందు భాగంలో 5 మెగా పిక్సల్ రిజల్యూషన్ కలిగిన సెల్ఫీ కెమెరా ఉంటుంది.
చైనాలో 2జీబి మోడల్ భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 5529 రూపాయలకి, 3GB RAM మోడల్ 6,030 రూపాయలకు విక్రయించబడుతోంది.  ఇండియాలో ధరలు ఎలా ఉంటాయి అన్నది స్పష్టం కావాల్సి ఉంది. ఇటీవలి కాలంలో అన్ని ఫోన్లు కనీసం 5.7 అంగుళాల కంటే ఎక్కువ పరిమాణం కలిగి ఉంటున్న  నేపథ్యంలో ఇలా కేవలం 5.45 అంగుళాలు మాత్రమే వుండటం చిన్న స్క్రీన్లు ఇష్టపడే వారికి నచ్చుతుంది. ఫోన్లో వీడియోలు వంటివి ఎక్కువగా చూసేవారు ఈ ఫోన్ పెద్దగా ఇష్టపడకపోవచ్చు.