
Xiaomi సంస్థ జులై 2వ తేదీన Mi CC9 ఫోన్ విడుదల చేస్తోంది. అయితే వారం రోజుల ముందే ఆ ఫోన్ కు సంబంధించిన ఫోటోలను ఆ సంస్థ సీఈవో Lei Jun విడుదల చేశారు.
ఈ ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలను ఈ ఫోటోలో స్పష్టంగా గమనించవచ్చు. వాటితో పాటు LED లైట్ అడుగు భాగంలో ఉంది. ఈ ఫోన్ వెనక భాగంలో ఎలాంటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేకపోవడం వలన in-display fingerprint sensor ఉండే అవకాశం ఉంది. ఫోన్ కుడిచేతివైపు వాల్యూమ్, పవర్ బటన్లు లభిస్తాయి.
అలాగే Mi CC9 ఫోన్ పై భాగంలో 3.5mm ఆడియో జాక్, సిమ్కార్డ్ స్లాట్ పొందుపరచబడ్డాయి. అలాగే ఈ ఫోన్ కి సంబంధించిన రిటైల్ బాక్స్ ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. 6GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్, 8 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్, మరియు 8GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ గలిగిన మూడు మోడళ్లు గా ఈ ఫోన్ మనకు లభిస్తుంది.
6.39 అంగుళాల Full HD+ స్క్రీన్ పరిమాణంతో, అమోల్డ్ డిస్ప్లే ఈ ఫోన్ కలిగి ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్, 4000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ, 27W ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ దీనికి ఉంటుంది. అలాగే ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెమెరా, వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగా పిక్సల్ సెకండరీ లెన్స్, 12 megapixel మరో సెన్సార్ ఉంటాయి. IR Blaster, USB Type-C సపోర్ట్, హై రిజల్యూషన్ ఆడియోలను ఈ Mi CC9 ఫోన్ కలిగి ఉంటుంది.